Wed Apr 01 2026 15:24:32 GMT+0530 (India Standard Time)
Chandrababu : అమరావతిని అంగుళం కూడా కదలించలేరు
అమరావతిని అంగుళం కూడా కదలించలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

అమరావతిని అంగుళం కూడా కదలించలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఉండేందుకు సిగ్గుపడాలని చంద్రబాబు అన్నారు. వింజమూరులో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఎవరు అధికారంలోకి వచ్చినా కొనసాగుతుందని తెలిపారు.
వైసీపీది మూడుముక్కలాట...
వైసీపీది మూడుముక్కలాట.. మూడురాజధానుల నినాదమన్న చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో వైసీపీ మళ్లీ విషం కక్కుతున్నారన్నారు. గత ఎన్నికల్లో మూడు ప్రాంతాల ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తన తీరు మార్చుకోలేదని, అందుకే వైసీపీని మరొకసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చంద్రబాబు ప్రజలకు పిలుపు నిచ్చారు.
Next Story

