Fri Mar 13 2026 11:45:38 GMT+0530 (India Standard Time)
New Rations Cards : కొత్త రేషన్ కార్డులో ఈ నిబంధనలు తప్పనిసరి.. చేయకుంటే కార్డు తొలగించడం గ్యారంటీ
కేంద్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరులో నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది

కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే, లబ్ధిదారుల గుర్తింపు కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది వంధ శాతం డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులన్నీ ఇప్పటికే డిజిటలైజ్ చేశారు. వీటిలో 99 శాతానికి పైగా కార్డులు ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి. ఇలా చేయని పక్షంలో, ఆ సభ్యుని పేరును కార్డు నుండి తొలగించే అవకాశం ఉంది.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు...
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ను పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేలా ఈ సదుపాయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా పోర్టబిలిటీ లావాదేవీలు నమోదయ్యాయి.స్మార్ట్ రేషన్ కార్డులు: ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాత కార్డుల స్థానంలో ఉచితంగా కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డుల'ను పంపిణీ చేసే ప్రక్రియ కూడా వేగవంతమైంది.e-KYC ప్రక్రియలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వెరిఫికేషన్ కేంద్రాలను పెంచింది. లబ్ధిదారులు క్రింది పద్ధతుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.
1. రేషన్ షాపుల ) వద్ద :
మీ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి, అక్కడ ఉన్న ఈ-పోస్మిషన్ ద్వారా వేలిముద్రలు వేసి e-KYC పూర్తి చేయవచ్చు. ఇది అత్యంత సులభమైన పద్ధతి.
ఆన్లైన్ ద్వారా:
మీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖవెబ్సైట్ ద్వారా కూడా చేయవచ్చు:
వెబ్సైట్లో 'e-KYC for Ration Card' ఆప్షన్ ఎంచుకోండి.
రేషన్ కార్డ్ నంబర్ మరియు ఆధార్ నంబర్ నమోదు చేయండి.
ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి సబ్ మిట్ చేయండి.
మీ-సేవ కేంద్రాలు, సచివాలయాల వద్ద :
గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల్లో లేదా మీ-సేవ కేంద్రాల్లో కూడా డాక్యుమెంట్లు సమర్పించి e-KYC అప్డేట్ చేసుకోవచ్చు.
ఎవరెవరికి మినహాయింపు?
ఐదేళ్ల లోపు చిన్నారులకు మినహాయింపు ఇచ్చారు.
బయోమెట్రిక్ సరిగ్గా పడని వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్నవారు (వీరికి ప్రత్యామ్నాయ వెరిఫికేషన్ మార్గాలు అందుబాటులో ఉంటాయి).
మీ రేషన్ కార్డులో సభ్యుల పేర్లు తొలగించబడకుండా ఉండాలంటే, ప్రభుత్వం విధించిన గడువులోగా e-KYC పూర్తి చేసుకోవడం ఉత్తమం.
Next Story

