Fri Jan 09 2026 20:44:24 GMT+0000 (Coordinated Universal Time)
Andhra pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..424 పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా పథకంలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 424 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
అర్హత ఏంటంటే...
సైకాలజీలో పీజీ చేసి, లేదా బీఏ, బీఎస్సీ చదవి సైకాలజీ చదవి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హతగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జీతం: నెలకు 30,000 + ₹4,000 (అలవెన్స్) మొత్తం 34,000 రూపాయలు చెల్లిస్తారు. వయస్సు 45 ఏళ్ల వరకు. ఉండవచ్చు. ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 18 జనవరి 2026 గా నిర్ణయించారు. పూర్తి వివరాలు & ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్లిక్ చేయాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వివరాలకుhttps://www.apjobalerts.in/2026/01/edcil-ap-recruitment-2026-counselor-jobs.html చూడొచ్చు.
Next Story

