Mon Mar 09 2026 14:17:32 GMT+0530 (India Standard Time)
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై కొత్త మెనూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో అంగన్వాడీల్లో కొత్త మెనూ ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పోషకాహారంలో మార్పులు చేసింది. ఇకపై వారంలో రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు. అదే రోజుల్లో ఉడికించిన శనగలు కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారరు.
పులిహోరకు బదులు...
అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇకపై పులిహోర బదులు ఈ కొత్త మెనూను ప్రవేశపెట్టారు. బాలామృతంలో కూడా మార్పులను చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీతసుకుంది. జూనియర్ బాలామృతం 7 నెలలు నుంచి 12 నెలల పిల్లలకు ఇవ్వనుంది. సీనియర్ బాలామృతం 13 నెలలు నుంచి 36 నెలల పిల్లలకు అందివ్వాలని నిర్ణయించింది.
Next Story

