Tue Mar 03 2026 12:40:16 GMT+0530 (India Standard Time)
వేట్లపాలెం దుర్ఘటన పై ఏపీ ప్రభుత్వం చర్యలు
వేట్లపాలెం దుర్ఘటన పై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

వేట్లపాలెం దుర్ఘటన పై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెద్దాపురం ఆర్డీఓ, అసిస్టెన్స్ కమిషనర్ ఆఫ్ లేబర్ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వల్లి ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని వేట్లపాలెంలో బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఇరవై మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.
సస్పెన్షన్ కాలంలో...
వేట్లపాలెం దుర్ఘటన లో నిర్లక్ష్యం వహించిన కారణంగా సస్పెన్షన్ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అధికారులు సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లద్దని ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల వివరాలు నమోదు చెయ్యక పోవడంతో పాటు ఇతర నిబంధనలు పాటించక పోవడం తో ప్రభుత్వం సస్పెన్షన్ తో పాటు పలు చర్యలను తీసుకుంది.
Next Story

