Mon Feb 09 2026 22:03:55 GMT+0530 (India Standard Time)
Breaking : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిలీఫ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది.

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. సెషన్స్ మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
పీటీ వారెంట్ పై..
అయితే ఆయన తనపై నమోదయిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న సెషన్స్ మొబైల్ కోర్టుబెయిల్ మంజూరు చేసింది. అయితే అంబటి రాంబాబుపై గుంటూరు కోర్టు ఈ నెల 22వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో ఆయన పీటీ వారెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉండనున్నారు.
Next Story

