Sat Mar 28 2026 11:05:40 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు జోగి రమేష్ బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ
ఆంధ్రప్రదేశ్ ఏసీబీ కోర్టులో నేడు జోగి రమేష్ బ్రదర్స్ బెయిల్ రద్దుపై విచారణ జరగనుంది

ఆంధ్రప్రదేశ్ ఏసీబీ కోర్టులో నేడు జోగి రమేష్ బ్రదర్స్ బెయిల్ రద్దుపై విచారణ జరగనుంది. నకిలీ మద్యం కేసులో జోగి సోదరుల బెయిల్ రద్దు చేయాలని సిట్ అధికారులు పిటీషన్ వేశారు. ఇద్దరూ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని, వీరి బెయిల్ రద్దు చేయాలని సిట్ వేసిన పిటీషన్ పై ఏసీబీ కోర్టు నేడు విచారణ చేయనుంది.
క్వాష్ చేయాలని...
మరొకవైపు మాజీ మంత్రి జోగిరమేష్ పై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని వేసిన పిటీషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తిరుపతి, ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ పై నమోదయిన కేసులను క్వాష్ చేయాలన్న పిటీషన్ పై నేడు విచారణ చేసిన తర్వాత ఎలాంటి తీర్పు ఇవ్వనుందో చూడాలి.
Next Story

