Fri Dec 05 2025 15:54:03 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రిలో పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టులో ఆయనకు జనసేన నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పవన్ కల్యాణ్ రాజమండ్రిలోని ఒక ప్రయివేటు గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు.
కాసేపట్లో ములాఖత్...
నందమూరి బాలకృష్ణ, లోకేష్‌లతో కలసి పవన్ కల్యాణ్ చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు వీరి ములాఖత్ జరగనుంది. మధురపూడి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత వస్తుంటే కేవలం ఐదు వాహనాలను మాత్రమే అనుమతించడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరికాసేపట్లో జనసేనాని రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లే అవకాశాలున్నాయి.
Next Story

