Sun Mar 22 2026 13:52:33 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఓటమి ఖాయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలయిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలయిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఏపీ ప్రజలు డిసైడ్ అయ్యారని, వైసీపీ ఓడిపోవడం తధ్యమని గంటా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు.
బాబే సీఎం...
వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవడంతో పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని కూడా గంటా శ్రీనివాసరావు అన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. గత నాలుగున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పోయిందన్న గంటా శ్రీనివాసరావు ప్రజా సమస్యలపై గొంతునొక్కుతున్న విపక్ష నేతలను అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టించారని అన్నారు.
Next Story

