Fri Dec 05 2025 16:43:54 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ తో రామకృష్ణ భేటీ
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబు కుటుంబ సభ్యులను సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు.

స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబు కుటుంబ సభ్యులను సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. రాజమహేంద్రవరంలో ఉన్న లోకేష్ ను కలసి రామకృష్ణతో పాటు సీపీఐ నేతలు కూడా లోకేష్ ను కలిసిన వారిలో ఉన్నారు. పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావులు కూడా రామకృష్ణ వెంట ఉన్నారు. చంద్రబాబుతో అరెస్ట్ తో అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా రామకృష్ణ లోకేష్ కు చెప్పారు.
సంఘటితంగానే...
అనంతరం ఆయన మాట్లాడుతూ నియంత నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వంపై విపక్షాలన్నీ కలసి పోరాటం చేయాలన్నారు. అందరు సంఘటితంగానే పోరాడితేనే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను గట్టిగా ప్రశ్నించగలమని తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్షాలు భయపడాల్సిన పనిలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఏ రోజూ స్ట్రీట్ పాలిటిక్స్ చేయలేదని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు సరైన రీతిలో గుణపాఠం చెబుతామని తెలిపారు. ధైర్యంగా ఉండాలని, త్వరలో చంద్రబాబు నిర్దోషిగా ఈ కేసు నుంచి బయటపడతారని రామకృష్ణ ఆకాంక్షించారు.
Next Story

