Mon Mar 16 2026 05:11:24 GMT+0530 (India Standard Time)
బాబు నివాసంలో భేటీ.. అక్కడి నుంచి నేరుగా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. చంద్రబాబు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించాలని, ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.
పలు సమస్యలపై....
జిల్లాల విభజన, ఉద్యోగుల సమస్య, అక్రమ మైనింగ్ వంటి వ్యవహారాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నివాసం నుంచి నేరుగా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు బయలుదేరనున్నారు. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
Next Story

