Sun Feb 01 2026 14:28:46 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సస్పెన్షన్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.

రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఈ సమావేశాల మొత్తం సస్పెండ్ చేసినట్లు స్పీకర ప్రకటించారు. తన నియోజకవర్గం పరిధిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు. అసెంబ్లీకి కూడా ఆయన నిరసన తెలుపుతూనే వచ్చారు. టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను సభ నుంచి సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు.
మిగిలిన సభ్యులను...
తెలుగుదేశం పార్టీలో మిగిలిన 12 మంది సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ పోడియం ఎదట ఆందోళనకు దిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరిని మాత్రం ఒకరోజు మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మిగిలిన ముగ్గురైన పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను సమావేశాల మొత్తం సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
Next Story

