Thu Mar 19 2026 19:22:32 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీ బడ్జెట్ ... కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. బడ్జెట్ ను ఆమోదించనుంది

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో ఈరోజు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ను కేబినెట్ ఆమోదించనుంది. కేబినెట్ లో బడ్జెట్ ను ఆమోదించిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
వ్యవసాయ బడ్జెట్ ను...
వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక శాసనమండలిలో బడ్జెట్ ను సీదిరి అప్పలరాజు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సంక్షేమానికే ఎక్కువ నిధులు కేటాయించే అవకాశముందని తెలుస్తుంది. ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఉండే అవకాశముంది.
Next Story

