Sun Feb 15 2026 00:35:48 GMT+0530 (India Standard Time)
Ap Budget : ఏపీ బడ్జెట్ 3,32,250 కోట్లు.. కేటాయింపులివే
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. వార్షిక బడ్జెట్ ను 3,32,250 కోట్లుగా నిర్ణయించారు. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లగా ఉంది. మూలధన వ్యయం 53,915 కోట్లుగా చూపారు. ద్రవ్యలోటు 75,868 కోట్లుగా ఉంది. రెవెన్యూ లోటు 22,002.02 కోట్లుగా ఉంది. రెవెన్యూ వ్యయం 2,56,143 మూలధన వ్యయం 53,915 కోట్లు, ద్రవ్యలోటు 75,868 కోట్లు, ప్రాధమిక లోట్లు 38,587 కోట్లు, కేంద్ర పన్నుల వాటా 64, 362 కోట్లుగా ఉంది. పన్ను ఆదాయం 1,25,650 కోట్ల రూపాయలుగా ఉంది. పన్ను యేతర ఆదాయం 11,473 కోట్లుగా చూపారు.
కేటాయింపులు
పాఠశాల విద్య - 32,308
వైద్య శాఖ - 19 306
వ్యవసాయ శాఖ - 11,745
బీసీ సంక్షేమం - 23,650
సోషల్ వెల్ఫేర్ - 11,118
ఇంధన శాఖ - 13.934 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ - 22,941 కోట్లు
జలవనరుల శాఖ - 18,228 కోట్లు
మున్సిపల్ శాఖ -14,358 కోట్లు
పోలవరం ప్రాజెక్టు - 6,105 కోట్లు
Next Story

