World Cup Finals 2023 : వ్యూయర్స్ ఎన్ని కోట్లు దాటతారో.. ఈరోజు రికార్డు బ్రేక్ కానుందా?

భారత్ - ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్స్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ లో ఎవరు విజేత అని నేడు తేలనుంది

Update: 2023-11-19 06:21 GMT

భారత్ - ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్స్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్ కప్ లో ఎవరు విజేత అని నేడు తేలనుంది. గత కొద్దిరోజులుగా సాగిన క్రికెట్ పండగకు నేటితో ఎండ్ కార్డు పడనుంది. వన్డే వరల్డ్ కప్ ను ఎవరు వీక్షిస్తారులే అనుకున్న సమయంలో ఇండియాలో జరిగిన మ్యాచ్‌లకు కోట్ల సంఖ్యలో వ్యూయర్‌షిప్ లభించింది. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ ను ఒక్క హాట్ స్టార్ లోనే ఐదు కోట్ల మంది చూసినట్లు అంచనా.

సెమీ ఫైనల్స్ లో...
ఈ ఫైనల్ మ్యాచ్ ను మరింత మంది చూసే అవకాశాలున్నాయి. గతంలో ఉన్న రికార్డులను ఈసారి వ్యూయర్‌షిప్ బ్రేక్ చేస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇండియా మొత్తం జియో నెట్ అందుబాటులో ఉండటంతో హాట్ స్టార్ లో చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కడైనా ప్రయాణాల్లో ఉన్నా సరే మ్యాచ్ ను వీక్షించే సౌకర్యం కలగడంతో వీక్షకుల సంఖ్య పెరిగింది. దుకాణాల్లో వ్యాపారం చేసుకుంటూనే మ్యాచ్ ను చూసే ఛాన్స్ ఉంది. దీనికి తగినట్లుగా ఫ్రీ స్ట్రీమింగ్ లు కూడా అందుబాటులోకి రావడంతో ఇక ఎక్కువ మంది మొబైల్ లోనూ ఫైనల్స్ మ్యాచ్ ను వీక్షించే అవకాశాలున్నాయి.
టీవీల్లోనే ఎక్కువ మంది...
ఎక్కువ మంది టీవీల్లోనే మ్యాచ్ ను చూసేందుకు ఇష్టపడతారు. ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని సండే నాడు మ్యాచ్ ను చూసేయొచ్చు. అందుకే టీవీల్లో చూసే వారి సంఖ్య కూడా కోట్లలోనే ఉంటుంది. అందుకోసమే ప్రకటనల ఛార్జీలను కూడా భారీగా పెంచేశారు. ఫైనల్స్ కావడం, సండే రావడంతో మ్యాచ్ ను ఎక్కువ మంది చూస్తారని కంపెనీలు కూడా ప్రకటనల కోసం పోటీ పడ్డాయి. ఈ సారి కప్పు మనదేనన్న ధీమాతో ఉన్న భారతీయులు ఎక్కువ మంది ఈరోజు టీవీలకు, మొబైల్స్ కే అతుక్కుపోతారనడంలో ఆశ్చర్యం ఎంతమాత్రం లేదు.


Tags:    

Similar News