Virat kohli : జిడ్డు గా ఆడతాడన్న వారికి ఆన్సర్ ఇదే కదా?

విరాట్ కొహ్లి సూపర్ బ్యాటింగ్‌తో భారత్ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది

Update: 2023-10-23 03:39 GMT

విరాట్ కొహ్లి సూపర్ బ్యాటింగ్‌తో భారత్ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. అయితే విరాట్‌లో ఎంతటి సహనం... ఎంతటి ఓర్పు.. బంతి ఊరిస్తూ వస్తున్నా టెంప్ట్ కాకపోవడం కొహ్లి ప్రత్యేకత. తాను అవుటయితే మ్యాచ్ ప్రత్యర్థి పరం అవుతుందని భావించి నిన్న కొహ్లి ఆడిన మ్యాచ్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. ప్రతి బంతిని ఆచి తూచి ఆడాడు. ఇదేంటి ఇలా కొహ్లి.. ఇంత జిడ్డుగా ఆడుతున్నాడేమిటి? అనుకున్న వారికి చివరలో విజయం సమాధానం చెప్పింది. దటీజ్ విరాట్ కొహ్లి. విరాట్ కొహ్లి క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలే అన్నది మరోసారి నిన్న జరిగిన మ్యాచ్‌లో అందరికీ అర్థమయింది.

క్రీజుకు అంటుకుపోయి...
రోహిత్ శర్మ 46 పరుగుల చేసి బాగానే ఆడారు. శుభమన్ గిల్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పన్నెండో ఓవర్ లో క్రీజులోకి వచ్చిన విరాట్ ను అవుట్ చేయడానికి న్యూజిలాండ్ కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయత్నించారు. కానీ కొహ్లి క్రీజుకు అంటుకు పోయాడు. పర్‌ఫెక్ట్ వచ్చిన బాల్ ను మాత్రం బౌండరీకి పంపుతూ స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలో క్రీజులో మరో ఎండ్ వైపు ఉన్న శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అయితే కేఎల్ రాహుల్ ఉన్నాడనే ధైర్యం. కేఎల్ రాహుల్, కొహ్లి కలసి నిలబడితే మనదే విజయం అని అందరూ వేసుకున్న అంచనాలు కొద్దిసేపటికే పటాపంచలయ్యాయి.
సెంచరీ మిస్...
కె‌ఎల్ రాహుల్ బ్యాడ్ లక్.. ఎల్‌బి‌డబ్యూగా వెనుదిరగడం, ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రనైట్ తో వెనుదిరగడంతో భారత్ విజయంపై అభిమానుల్లో టెన్షన్ మొదలయింది. బంతుల కంటే రన్స్ తక్కువగా ఉన్నా వికెట్లు లేకపోవడంతో జడేజా ఉన్న ధైర్యం ఒకవైపు, ఏమైనా జరగొచ్చన్న అనుమానం మరొక వైపు ఫ్యాన్స్ ను టెన్షన్‌లోకి నెట్టేశాయి. ఇక మూడు ఓవర్లుండగా విరాట్ కొహ్లి సిక్సర్ కొట్టడంతో భారత్ విజయం ఖాయమైంది. అయితే 95 పరుగులు చేసిన విరాట్ కొహ్లి ఇంకో సెంచరీ పూర్తి చేస్తారని అందరూ భావించారు. అవతల ఎండ్‌లో ఉన్న జడేజా కూడా విరాట్ కు బ్యాటింగ్ కు అవకాశమిచ్చాడు.
పాయింట్ల పట్టికలో...
కానీ బ్యాడ్‌లక్ క్యాచ్ ఇచ్చి 95 పరుగులు వెనుదిరగడంతో స్టేడియం మొత్తం విరాట్ కు అభివాదం పలికింది. విరాట్ ఉంటే అదొక ధైర్యం. విరాట్ ను 20 పరుగుల లోపే అవుట్ చేయాలి. లేకుంటే ఇక కష్టమే. న్యూజిలాండ్ అదే తప్పు చేసింది. కొహ్లి విషయంలో చేసిన తప్పు వరస విజయాలపై చూపించినట్లయింది. భారత్ న్యూజిలాండ్ పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌లలో వరసగా గెలిచి పది పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో ఉంది. కొహ్లి అందుకే నువ్వు ఉండాలయ్యా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Tags:    

Similar News