World Cup 2023 : ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్స్ కే... కానీ అంత తేలికకాదు

ఈరోజు వరల్డ్ కప్ లో పోరు హోరా హోరీగా సాగనుంది. ఆస్ట్రేలియా ఆప్ఘనిస్థాన్ జట్టుతో నేడు తలపడనుంది

Update: 2023-11-07 04:09 GMT

ఈరోజు వరల్డ్ కప్ లో పోరు హోరా హోరీగా సాగనుంది. ఆస్ట్రేలియా ఆప్ఘనిస్థాన్ జట్టుతో నేడు తలపడనుంది. ముంబయి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. వరసగా ఐదు మ్యాచ్‌లలో గెలిచి ఆస్ట్రేలియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పదికి చేరుకుంది. ఈ మ్యాచ్ గెలిస్తే పన్నెండుకు చేరి సెమీఫైనల్స్ లో బెర్త్ ను ఖరారు చేస్తుంది. తర్వాత మరో మ్యాచ్ బంగ్లాదేశ్ లో ఆడాల్సి ఉండటంతో సునాయాసంగా సెమీ ఫైనల్స్ కు చేరతామన్న ధీమాతో ఉంది.

ఐదు మ్యాచ్ లలో వరసగా గెలిచి...
తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత పుంజుకుని తర్వాత వరసగా ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. ఓపెనర్ మార్ష్ అందుబాటు లేరు. ఇంగ్లండ్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఈ రోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే సెమీఫైనల్స్ కు చేరినట్లే. ఇప్పటికే ఇండియా సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. సౌతాఫ్రికా కూడా సెమీ ఫైనల్స్ కు చేరడంతో ఆసీస్ ఈ మ్యాచ్ గెలిచి మూడో జట్టుగా సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది.
పెద్ద జట్లను ఓడించి....
అయితే ఆప్ఘనిస్థాన్ జట్టును తీసిపారేయడానికి వీలులేదు. సౌతాఫ్రికా, పాకిస్థాన్‌లపై ఆ జట్టు సాధించిన విజయాలతో మంచి ఊపు మీదుంది. ఆ రెండు జట్లను ఓడించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా తయారైంది. చిన్న జట్టు అనికొట్టి పారేయడానికి వీలులేదు. ఆప్ఘనిస్థాన్ ఈ మ్యాచ్ గెలిస్తే పాకిస్థాన్ కంటే ఎక్కువ పాయింట్లు సాధించి టేబుల్ లో పైకి ఎగబాకుతుంది. మరి ఈరోజు ఏ జట్టు గెలుస్తుందన్నది క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతుంది.


Tags:    

Similar News