Wolrd cup 2023 : భారీ స్కోరు దిశగానే న్యూజిలాండ్

ధర్మశాలలో ఇండియా - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2023-10-22 11:40 GMT

ధర్మశాలలో ఇండియా - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 40ఓవర్లు పూర్తయ్యాయి. నాలుగు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 219 పరుగులు చేసింది. మిచెల్ సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. మూడు వందల పరుగులకు మించి చేసి భారత్ పై వత్తిడి పెంచాలన్న ఉద్దేశ్యంతో న్యూజిలాండ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. టాస్ గెలుచుకున్న భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.

తొమ్మిది పరుగులకే...
తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఆ తర్వాత నిలదొక్కుకుంది. క్రమంగా పుంజుకుని స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. రచిన్ రవీంద్ర 75 పరుగుల అవుట్ కావడంతో భారీ భాగస్వామ్యానికి షమీ తెరదించాడు. ఇప్పటి వరకూ మహ్మద్ షమీకి రెండు, సిరాజ్, కులదీప్‌లకు చెరో ఒకటి లభించింది. కులదీప్ యాదవ్ బౌలింగ్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు భారీగా పరుగులు సాధించుకున్నారు. మూడు వందల పరుగులు దాటే అవకాశాలున్నాయని అంచనా వినిపిస్తున్న నేపథ్యంలో వడివడిగా వికెట్లు పడితేనే కొంతైనా న్యూజిలాండ్ ను కట్టడి చేయగలరు. లేకుంటే ఇంకా స్కోరు పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News