world cup : వరల్డ్ కప్ ను వీక్షించేవాళ్లెవరు?

వన్డే క్రికెట్ కు ఉన్న క్రేజ్ టెస్ట్ మ్యాచ్ లకు ఉండదు. అలాగే టీ 20లకున్న టీఆర్పీ రేటింగ్ వన్డేలకు ఉండటం లేదు

Update: 2023-09-30 03:54 GMT

ఒకప్పుడు వన్డే మ్యాచ్ లంటే టీవీలు అతుక్కు పోయి చూసేవాళ్లు. భోజనం కూడా మానేసి మరీ టీవీ ముందే కూర్చుని వీక్షించే రోజులవి. రేడియోలో కామెంటరీ వినే వాళ్లు కూడా అనేకమంది 1980 దశకంలోనే ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలంలోనూ వన్డే మ్యాచ్ లకున్న క్రేజ్ మరే ఆటకూ ఉండేది కాదు. కలర్ టీవీలు వచ్చిన తర్వాత వన్డేలంటే మరింత పిచ్చి పెరిగింది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా లక్షల నుంచి కోట్లలోకి మారారు. క్రికెట్ ను ఆడకపోయినా గేమ్ పద్ధతులను తెలుసుకుని మరీ బెట్టింగ్ లకు కూడా పాల్పడే వారు. ఇక వరల్డ్ కప్ జరుగుతుందంటే 1990వ దశకంలో టీవీ కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటించేవి. కొత్త కొత్త కంపెనీలు వచ్చి ఆకట్టుకునేవి. క్రికెట్ కోసమే కొన్ని కంపెనీల కలర్ టీవీలను కొనుగోలు చేశారంటే ఈతరం వాళ్లు నమ్మకపోయినా అది నిజం.

టెస్ట్ పోయి వన్డే వచ్చి...
వన్డే క్రికెట్ కు ఉన్న క్రేజ్ టెస్ట్ మ్యాచ్ లకు ఉండదు. రోజుల తరబడి ఆడటంతో పాటు స్లో గా ఆట సాగుతుండటం టెస్ట్ మ్యాచ్ లంటే పెద్దగా పట్టింపు లేదు. లైట్ గా తీసుకోవడం మొదలుపెట్టారు. యాభై ఓవర్లతో వన్డే మ్యాచ్ చూసేందుకు మాత్రం కళ్లు అప్పగించి మరీ చూసేవారు అధికమయ్యారు. సునీల్ గవాస్కర్, వెంగసర్కార్, అజారుద్దీన్, కపిల్ దేవ్, రవిశాస్త్రి వంటి ఆటగాళ్లు మైదానంలో ఉంటే గంటల తరబడి కూర్చుని మరీ ఆటను చూసేవారు. ప్రతి బంతికి అంచనా వేసి ఏ జట్టు గెలుస్తుందో ఇట్టే చెప్పేవారు. రాను రాను క్రికెట్ అంటే భారత్ లో భాగమయి పోయింది. అభిమానులు పెరిగారు. ఆటను ఆదరించేవారి సంఖ్య పెరిగింది. ఆటగాళ్లు కూడా మారిపోయారు.
రూపాన్ని మార్చుకుని...
కానీ తర్వాత క్రికెట్ తన రూపాన్ని మార్చుకుంది. ఐపీఎల్ వచ్చి మొత్తం క్రికెట్ హిస్టరీనే మార్చేసింది. టీ 20కి ఉన్న క్రేజ్ ఇప్పుడు వన్డే మ్యాచ్ లకు లేదు. గతంలో టీఆర్పీ రేటింగ్ వన్డే మ్యాచ్ లకు ఉంటే ఇప్పుడు టీ 20లు వచ్చి తమ రేటింగ్ ను తమ సొంతం చేసుకున్నాయి. కేవలం ఇరవై ఓవర్లలో ఒక జట్టు ఎంత స్కోరు చేస్తుందనేది.. ప్రత్యర్థి లక్ష్యం ఎంతనేది తెలిసి పోతుంది. ఆరే ఆరు గంటల్లో ఫలితం కళ్లముందుంటుంది. దీంతో పాటు అదిరిపోయే షాట్లు.. క్యాచ్ లతో పాటు కనురెప్ప మూసి తెరిచే లోగా ఫలితం తారు మారయ్యే అవకాశాలు ఇందులో పుష్కలం. రన్ రేటు ఎంతున్నా సరే చివరి బాల్ వరకూ టెన్షన్ పెట్టేది టీ 20 మాత్రమే. చివరి బాల్ కు సిక్స్ కొట్టాలంటే కొట్టి మరీ విక్టరీ కొట్టిన ఆటగాళ్లున్నారు. ఎంతోమంది గేమ్ ఛేంజర్లు టీ 20 మూలంగా తయారయ్యారు.
అప్పుడు తప్ప...
దీంతో వన్డే మ్యాచ్ లకు కొంత క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. వన్డే మ్యాచ్ ను పూర్తిగా చూడాలంటే పది గంటల పాటు కూర్చోవాలి. స్టేడియానికి వెళ్లే వారి సంఖ్య కూడా తక్కువగానే కనిపిస్తుంది. ఇక టీవీల్లో వన్డే మ్యాచ్ లు చూసే వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మొబైల్ లో వస్తున్న స్కోరు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక పాక్ - ఇండియా మ్యాచ్ జరుగుతుంటే మాత్రం టీఆర్పీ రేటింగ్ అదిరిపోతుంది. లేకుంటే అదీ ఉండదు. భారత్ ఆడే మ్యాచ్ లనే ఎక్కువగా వీక్షించే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో ఎక్కువయింది. ఏదైనా టెన్షన్ ఉంటే.. స్కోరు తక్కువ.. బాల్స్ తక్కువగా ఉన్నప్పుడు.. టార్గెట్ ను ఛేజ్ చేస్తారా? లేదా? అన్న అనుమానం వచ్చినప్పుడు మాత్రమే టీవీలను ఆన్ చేస్తున్నారు. అందుకే రేపటి వరల్డ్ కప్ కు కూడా వీక్షకుల సంఖ్య తక్కువగానే ఉంటుందన్న అంచనాలు ివినిపిస్తున్నాయి.
Tags:    

Similar News