World Cup Semi Finals 2023 : కళ్లన్నీ అటువైపే.. గిల్ హాఫ్ సెంచరీ చేయగానే

ముంబయి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఇండియా - న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ కు సారా టెండూల్కర్ కూడా హాజరయ్యారు.

Update: 2023-11-15 12:48 GMT

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా భారీ స్కోరు చేసింది. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. యాభై ఓవర్లలో సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. కానీ ఎప్పటిలాగానే శుభమన్ గిల్ కూడా చెలరేగి ఆడాడు. ఎనభై పరుగులు చేసిన శుభమన్ గిల్ రిటైర్డ్ హర్ట్ అయి వెనుదిరిగాడు. కాలి కండరాలు పట్టడంతో అతను రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అయితే ముంబయి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఇండియా - న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ కు సారా టెండూల్కర్ కూడా హాజరయ్యారు.

అన్నీ అటువైపే...
కెమెరాలన్నీ ఆమె వైపు చూపుతున్నాయి. గిల్ సిక్సర్ కొట్టినప్పుడల్లా సారా ఎక్స్‌ప్రెషన్స్ కు రికార్డు చేస్తున్నాయి. నిజమో అబద్ధమో తెలియదు కానీ.. ఒక గిల్ ఆడుతున్నంత సేపూ ఒక కెమెరాను సారా కూర్చున్న స్టాండ్స్ వైపే ఉంచినట్లు అనిపించింది. గిల్ హాఫ్ సెంచరీ చేయగానే సారా టెండూల్కర్ లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. సిక్సర్ బాదినప్పుడల్లా బంతిని చూపిన తర్వాత గిల్ కంటే కెమెరా ఒకటి సారా వైపు తిరగడం కనిపించింది. అంటే కెమెరామెన్లు కూడా ఎంత అలర్ట్‌గా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది.
సచిన్ అదే స్టేడియంలో....
అదే స్టేడియంలో తన తండ్రి సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. కానీ సచిన్ కంటే సారా వైపు కెమెరాలు ఎక్కువ సేపు తిరిగాయంటే అతిశయోక్తి కాదేమో. అన్ని మ్యాచ్ లలో సారా టెండూల్కర్ హాజరయి శుభమన్ గిల్ ను ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. అది చూసేవారికి కూడా జరుగుతున్న ప్రచారంపై అనుమానం కలిగిస్తుంది. నిజంగా సారా టెండూల్కర్, శుభమన్ గిల్ మధ్య ప్రేమాయణం ఉందో లేదో తెలియదు కానీ, ఈ వరల్డ్ కప్ పుణ్యమా అని ప్రపంచం మొత్తం అదే అభిప్రాయంలో ఉంది.


Tags:    

Similar News