World cup : మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్

ఇండియా - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు

Update: 2023-10-22 13:59 GMT

ఇండియా - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. సిక్సర్లు, ఫోర్లతో మైదానం చుట్టూ న్యూజిలాండ్ ఫీల్డర్లకు చుక్కలు చూపుతున్నాడు. హాఫ్ సెంచరీకి దగ్గరగా చేసిన రోహిత్ శర్మ మరొకసారి తాను ఇండియాకు ఉన్నానంటూ నిరూపించుకున్నాడు. కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానుల ఆదరాభిమానులను మరింత చూరగలిగాడు. 46 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఐటయ్యాడు. ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారు.

ఓపెనర్లు ఇద్దరూ...
ఇండియా ఓపెనర్లు ఇద్దరూ చక్కగా రాణించారు. తొలి పది ఓవర్లలోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ 46 పరుగులు చేయగా, గిల్ 25 పరుగుల వద్ద ఉన్నాడు. రోహిత్ శర్మ అవుట్ కావడంతో ఇప్పుడు విరాట్ కొహ్లి క్రీజులోకి వచ్చాడు. కొహ్లి కుదురుకుంటే ఇక న్యూజిలాండ్ పని అయిపోయినట్లేనని ఫ్యాన్స్ అంచనా. అయితే కొహ్లి ఎంత వరకూ నిలదొక్కుకుంటాడననది చూడాల్సి ఉంది. రన్ రేట్ బాగానే ఉంది. న్యూజిలాండ్ భారత్ కు 274 పరుగుల లక్ష్యాన్ని విధించింది. 14 ఓవర్లకు భారత్ 84 పరుగులు చేసింది. 26 పరుగుల వద్ద శుభమన్ గిల్ అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో విరాట్ కొహ్లి, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.


Tags:    

Similar News