World Cup 2023 : గూస్‌బమ్స్ గ్యారంటీ... ఈడెన్ గార్డెన్స్ అదుర్స్....ఎవరూ తక్కువ కాదుగా

నేడు ఇండియా - సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్ అద్భుతమైన మ్యాచ్ వేదిక కానుంది.

Update: 2023-11-05 03:58 GMT

నేడు మ్యాచ్ మూమూలుగా ఉండదట.. అందుకే ఈడెన్ గార్డెన్స్‌లో అంతా ఇప్పటి నుంచే సందడి ప్రారంభమయింది. ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు గెలిచిన భారత్ టేబుల్ టాపర్ గా నిలిచింది. ఎనిమిదో మ్యాచ్ లోనూ గెలిస్తే ఇక మరో రికార్డుకు చేరువయినట్లే. అందుకే సౌతాఫ్రికా మీద ఇండియా గెలవాలని ప్రతి భారత అభిమాని కోరుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమైన మ్యాచ్. రోహిత్ సేన ఎనిమిదో మ్యాచ్ గెలవాలంటూ ఫ్యాన్స్ ప్రత్యేక ప్రార్థనలను ఇండియా అంతటా జరుపుతున్నారు. దీంతో పాటు విరాట్ కోహ్లి పుట్టిన రోజు కావడంతో అతడికి మ్యాచ్ గెలిచి గిఫ్ట్ ఇవ్వాలని అందరూ ఆశిస్తున్నారు. టీం ఇండియా కూడా అదే ఆలోచనలో ఉంది.

బలాబలాలు...
బలాబలాలను చూస్తే... రెండు జట్లు సమానంగానే ఉన్నాయి. వరల్డ్ కప్ లో తమ సత్తాను చాటుతున్నాయి. సౌతాఫ్రికా ఏడు మ్యాచ్ లు ఆడింది. అయితే డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో ఒక మ్యాచ్ చేజార్చుకోవడంతో ఇండియా కంటే ఒక అడుగు తక్కువలో ఉంది. రెండు జట్లు సరిసమానమైన రీతిలో మైదానంలో తన పెర్‌ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. అందుకే ఈ మ్యాచ్ అందరికీ ప్రత్యేకం. పైగా సండే కావడంతో మైదానం మొత్తం అభిమానులతో నిండిపోతుంది. ఇక ఇరుజట్ల నుంచి మంచి షాట్లు చూసే అవకాశం లభిస్తుంది. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం దద్దరిల్లనుంది. అంతేకాదు బౌలర్లు కూడా వికెట్లు తీసినప్పుడల్లా స్టేడియం ఒక ఊపు ఊగకుండా ఉండదు.
గూస్‌బమ్స్ రావాల్సిందే...
భారత్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలంగా ఉంది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా ఇలా ఈ పేర్లు వింటే చాలు ఇండియన్ ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఊపు రాకమానదు. గూస్‌బమ్స్ రావాల్సిందే. ఈ వరల్డ్ కప్ లో అందరూ ఫామ్ లో ఉండటం కూడా కలసి వచ్చే అంశం. ఏ ఒక్కరూ తక్కువ కాదు. నిలబడ్డారంటే చాలు అర్థ శతకం గ్యారంటీ. ఇంకాస్త ప్రత్యర్థి ఛాన్స్ ఇస్తే చాలు ఇద్దరు ముగ్గురు సెంచరీలు కొట్టే సత్తా కలిగినోళ్లు. అందుకే బ్యాటింగ్ పరంగా ఒక వికెట్ పడినా భారత్ కు ఢోకా లేదన్న ధీమా ప్రతి ఒక్క అభిమానికి కూడా ఉంటుంది. కాకుంటే అర్థ సెంచరీలు, సెంచరీలు వంటి రికార్డుల మీద మాత్రమే ఫ్యాన్స్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.
సౌతాఫ్రికా కూడా...
ఇక బౌలింగ్ పరంగా కూడా పటిష్టంగా ఉంది. బుమ్రా, షమి, సిరాజ్, కులదీప్ యాదవ్, జడేజా వంటి వాళ్లతో ప్రత్యర్థులు వికెట్లు ఎగిరి అవతలపడుతున్నాయి. సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా చెలరేగి ఆడుతున్నారు. డికాక్ సెంచరీల మీద సెంచరీల చేస్తున్నాడు. రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్ కూడా సెంచరీలు చేస్తూ స్కోరు బోర్డు పరుగులు తీస్తుంది. ఇక బౌలింగ్ పరంగా కూడా బలిష్టంగా ఉంది. అందుకే సౌతాఫ్రికాను ఏ కోణంలోనూ తక్కువ చేసి చూడలేం. అందుకే ఈరోజు జరిగే ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ అదిరిపోతుంది. ఇటు ఇండియా, అటు సౌతాఫ్రికా జట్లు మైదానంలో చెలరేగి ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇక కాస్కోండి... చూస్కోండి.


Tags:    

Similar News