World Cup Finals 2023 : స్టేడియమంతా సైలెన్స్.. అతి తక్కువ స్కోరుకు వెనుదిరిగిన టీం ఇండియా

ఇండియాకు ఫైనల్స్ ఫియర్ పట్టుకున్నట్లుంది. పట్టుమని పది ఓవర్లు కూడా ఒక్కరూ నిలవకుండా అతి తక్కువ స్కోరుకు అవుట్ అయ్యారు.

Update: 2023-11-19 12:26 GMT

టీం ఇండియాకు ఫైనల్స్ ఫియర్ పట్టుకున్నట్లుంది. పట్టుమని పది ఓవర్లు కూడా ఒక్కరూ నిలవకుండా అతి తక్కువ స్కోరుకు అవుట్ అయ్యారు. యాభై ఓవర్లకు నది వికెట్లు కోల్పోయి ఇండియా 240 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు అతి తక్కువ లక్ష్యాన్ని ఉంచారు. ఆస్ట్రేలియా 241 పరుగులు చేయాల్సి ఉంది. ఒక దశలో కనీసం మూడు వందల పరుగులు చేస్తారనుకుంటే 250 పరుగులు చేయడం కూడా కష్టంగా మారిందంటే ఎలా అవుట్ అయ్యారో ఇట్టే అర్థమవుతుంది. ఫామ్ లో ఉన్న బ్యాటర్లందరూ పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ కు వెళ్లడంతో స్టేడియం మొత్తం సైలెన్స్ అయింది.

వారిద్దరూ మినహా...
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసిస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు కూడా పెద్దగా స్కోరు చేయకుండానే వెనుదిరిగాడు. ఎవరూ విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ లు మినహా పెద్దగా పరుగులు చేయలేదు. రోహిత్ శర్మ 47 పరుగులు చేయగా, మిగిలిన వాళ్లంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. శుభమన్ గిల్ కూడా నిరాశపర్చాడు. శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నాడనుకుంటే డకౌట్ తో వెనుదిరిగాడు.
ఇవేం రన్స్...
బౌలర్లు బ్యాటింగ్ వచ్చి ఏం చేయగలరు. కనీసం 280 పరుగులు చేస్తే కొంత ఆస్ట్రేలియాను కట్టడి చేయవచ్చని క్రీడా నిపుణులు సయితం అంచనా వేశారు. కానీ సూర్యకుమార్ యాదవ్ పై ఎంతో కొంత ఆశలున్నా 18 పరుగులకే వెనుదిరిగాడు. యాభై ఓవర్లు పూర్తి చేయకుండానే అందరూ వెనుదిరగడంతో భారత్ అభిమానులు డీలా పడ్డారు. అయితే ఫామ్ లో ఉన్న వారు ఇబ్బందులు పడి అవుట్ అవ్వడం చూసి ఫైనల్స్ లో ఆడే మ్యాచ్ ఇదేనా? అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. పన్నెండేళ్ల తర్వాత చేతికి అందివచ్చిన వరల్డ్ కప్ ను చేజార్చుకుంటారేమోనన్న బాధ ప్రతి ఒక్క ఫ్యాన్ లో మొదలయింది. కానీ ఆసీస్ ను ఎలా కట్టడి చేస్తారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News