World Cup Finals 2023 : గెలుపు గ్యారంటీ... అంచనాలు అధికం.. ప్రత్యేక పూజలు

నేడు భారత్ - ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్స్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా భారత్ లో అభిమానులు ఎదురు చూస్తున్నారు

Update: 2023-11-19 03:19 GMT

నేడు భారత్ - ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్స్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా భారత్ లో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంకొద్ది గంటల్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇండియా మొత్తం క్రికెట్ ఫీవర్ అలుముకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే అనేక మంది అక్కడకు చేరుకున్నారు. ఇక నేరుగా చూడలేని వారు సండే కావడంతో మ్యాచ్ మొత్తాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఓటమి లేకుండా...
భారత్ ఈ వన్డే వరల్ కప్ లో ఓటమి లేకుండా ఫైనల్స్ లో అడుగు పెట్టింది. లీగ్ మ్యాచ్ లు అన్నింటిలోనూ విజయం సాధించింది. సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై విజయం సాధించి సత్తా చాటింది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్రమోదీతోపాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని, ఇతర సెలబ్రిటీలు, వీఐపీలు వస్తుండటంతో పెద్దయెత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం పది గంటల నుంచే క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం స్టేడియంలోకి అనుమతించనున్నారు.
పన్నెండేళ్ల తర్వాత...
భారత్ ఫైనల్స్ లో గెలిచి పన్నెండేళ్ల తర్వాత వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అందుకోసం ప్ర్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో బలంగా ఉన్న భారత్ కు ఫైనల్స్ లోనూ విజయం దక్కుతుందని క్రీడానిపుణులు అంచనా వేస్తున్నారు. అటు ఆస్ట్రేలియా కూడా ఈ వరల్డ్ కప్ లో తొలుత తడబడినా ఆ తర్వాత పుంజుకుని వరస గెలుపుల మీద ఊపు మీద ఉంది. దీంతో రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ మాత్రం ఆసక్తికరంగానే సాగనుంది. క్రికెట్ అంటే గెలుపోటములు సహజం. అలాగని మన దేశం విజయం సాధించాలని కోరుకోవడంలో తప్పులేదు. అందుకే ఇండియా మొత్తం సండే రోజున క్రికెట్ పండగను వీక్షించేందుకు సిద్ధమవుతుంది.
Tags:    

Similar News