World Cup Semi Finals Race : ఆడతారు సరే... సెమీస్‌కు వెళ్లేది లేనిది నిర్ణయించేది?

నేడు వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ - శ్రీలంక మధ్య చివరి మ్యాచ్ చెన్నైలో జరుగుుతుంది.

Update: 2023-11-09 04:01 GMT

నేడు వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్స్ కు చేరేందుకు న్యూజిలాండ్ రెడీగా ఉంది. అయితే ఈరోజు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో భారీ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంది. న్యూజిలాండ్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ లు కూడా దాని వెంటనే ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఈరోజు శ్రీలంకతో ఆడబోయే న్యూజిలాండ్ మ్యాచ్ ఆ జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుతుందా? లేదా? అన్నది నిర్ణయిస్తుంది.

వర్షం ముప్పు...
ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో న్యూజిలాండ్ జట్టుకు సాధారణ విజయం అవసరం లేదు. సూపర్ విక్టరీ కొడితేనే అది సెమీ ఫైనల్ కు చేరే అవకాశాలున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా న్యూజిలాండ్ కు కష్టాలు తప్పవు. న్యూజిలాండ్ వరసగా నాలుగు ఓటములతో సెమీస్ కు చేరుకోవడం కష్టంగా మార్చుకుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో మధ్యాహ్నం న్యూజిలాండ్ - శ్రీలంక మ్యాచ్ జరగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.శ్రీలంకకు పోయేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే అది సెమీ ఫైనల్స్ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్ కే భారీ గెలుపు అవసరం. 
ఇదే చివరి మ్యాచ్...
వరల్డ్ కప్ ప్రారంభమయిన తొలినాళ్లలో తమకు తిరుగులేదని భావించేలా ఆడిన న్యూజిలాండ్ ఆ తర్వాత వరసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు సెమీ ఫైనల్స్ చేరాయి. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్ తో పాటు పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ లు పోటీ పడుతున్నాయి. మూడు జట్లు ఎనిమిది పాయింట్లతో సమానంగా ఉన్నాయి. రన్ రేట్ లో మాత్రం న్యూజిలాండ్ మెరుగ్గా ఉంది. ఈ రోజు వర్షం కురిసి మ్యాచ్ రద్దయినా, చెరొక పాయింట్ వచ్చినా న్యూజిలాండ్ ఇంటికి వెళ్లినట్లే. ఇలా న్యూజిలాండ్ సెమీస్ ఫైనల్స్ చేరిక పై ఊగిసలాడుతుంది.


Tags:    

Similar News