ఆస్ట్రేలియా చేసిన అతి పెద్ద తప్పే.. చివరకు

ఆస్ట్రేలి చేసిన తప్పు భారత్ కు వరమైంది. విరాట్ కొహ్లి ఇచ్చిన క్యాచ్ ను జార విడిచడంతో మ్యాచ్ భారత్ కు దక్కింది

Update: 2023-10-09 03:57 GMT

ఆస్ట్రేలియా చేసిన తప్పు భారత్ కు వరమైంది. డేంజర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కొహ్లి క్యాచ్ ను జార విడిచడంతో మ్యాచ్ భారత్ కు దక్కింది. కేవలం పన్నెండు పరుగుల వద్ద కొహ్లి ఇచ్చిన క్యాచ్ వదిలేయడంతో ఇక విరాట్ ను ఎవరూ ఆపలేకపోయారు. ఒకవైపు విరాట్ కొహ్లి, మరొక వైపు కె.ఎల్ రాహుల్ ఆస్ట్రేలియా బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా వీర బాదుడు బాదారు. మ్యాచ్ ఇరవై ఓవర్లు ముగిసిన తర్వాత భారత్ దే విజయం అన్న అంచనాలు వినిపించాయి.

నిలదొక్కుకుంటే...
క్రీజులో నిలదొక్కుకుంటే చాలు.. వారిని ఆపడం ఎవరి తరం కాదని మరోమారు నిరూపించాడు విరాట్ కొహ్లి. సెంచరీ తృటిలో మిస్ అయింది కాని ఆ దిశగానే విరాట్ వీర బాదుడు నిన్న మ్యాచ్ చూసిన వారికి అర్థమయింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఒక దశలో పూర్తిగా చేతులెత్తేశారు. విరాట్ కొహ్లి ఇచ్చిన క్యాచ్ ను మిచెల్ మార్ష్ వదిలేయడంతో విజయం భారత్ వశమయింది. అదే ఆస్ట్రేలియా చేసిన అతి పెద్ద తప్పు. విరాట్ మైదానంలో నిలదొక్కుకుంటే ఇక ఆపడం ఎవరి తరమూ కాదన్నది మరోసారి రుజువైంది.
విరాట్ వీరవిహారం...
స్వల్ప పరుగులకే ఆస్ట్రేలియా బ్యాటింగ్ పూర్తి చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు మొదట ఓపెనర్లందరూ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. కేవలం రెండు పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అవుట్ కావడంతో ఇక భారత్ పని అయిపోయినట్లేనని అందరూ భావించారు. క్రికెట్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఈ సమయంలో కీలకమైన క్యాచ్ ను ఆస్ట్రేలియా విడిచి పెట్టడంతో భారీ విజయాన్ని భారత్ నమోదు చేసుకుంది.


Tags:    

Similar News