World Cup Finals 2023 : ఆ ఇద్దరూ నిలబడి.. కలబడి.. కప్‌‌ను ఎగరేసుకెళ్లారు

భారత్ పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరల్డ్ కప్ ను ఎగరేసుకు వెళ్లింది.

Update: 2023-11-19 15:58 GMT

అవును.. ఇది క్రికెట్.. గెలుపోటములు ఎవరి చేతిలో ఉండవు. ఆరోజు ఎవరిదైతే వారిదే విజయం. ఆరో సారి ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాను ఇద్దరే నిలబడి గెలిపించారు. హెడ్, లబూషేన్ లు చివరి వరకూ ఆడి తమ దేశానికి కప్ ను తీసుకెళ్లారు. వరల్డ్ కప్ ను ఎగరేసుకుని వెళ్లింది. భారత్ ఓటమి పాలయింది. కంటి ముందు తక్కువ లక్ష్యం ఉండటంతో నింపాదిగా ఆడి అనుకున్న టార్గెట్ రీచ్ అయింది. లాబుషేన్, హెడ్ నిలబడి మరీ ఆసీస్ ను గెలిపించారనే చెప్పాలి. మూడు వికెట్లు వెంటవెంటనే పడిపోయినా వారిలో కంగారు లేదు. తత్తరపాటు లేదు. కంటి ముందున్న లక్ష్యం స్వల్పంగా కనిపిస్తున్నప్పుడు కప్పు కొట్టడంపై కన్ను పెట్టారు.

బౌలర్లకు దొరక్కుండా...
ఇది కదా ఆటంటే.. హెచ్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ హెడ్ ను అవుట్ చేయడంలో భారత్ బౌలర్లు సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఇరవై ఓవర్లలోనే వంద పరుగులను దాటించడంతో టీం ఇండియా ఫ్యాన్స్ లో ఇక ఆసీస్ దే విజయం అన్న నమ్మకం ఏర్పడింది. లబూషేన్ కూడా ఇంకా చేతిలో వికెట్లు ఉండటంతో పాటు భారత్ బౌలర్లకు వారు దొరకక పోవడంతో పాటు స్కోరు బోర్డును పరుగులు తీయించారు. ఆసీస్ చివరకు తానే విశ్వవిజేతగా నిలిచింది. హెడ్ 137 పరుగులు చేయగా, హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తొలుత తడబడినా...
ఈ వరల్డ్ కప్ ప్రారంభమయిన తర్వాత తొలి లీగ్ మ్యాచ్ లో తడబడిన ఆస్ట్రేలియా తర్వాత క్రమంగా పుంజుకుంది. అలాగే రన్ రేటు కూడా తక్కువగా ఉండటంతో సెమీ ఫైనల్స్ కు వస్తుందో? రాదో? అన్న అనుమానం కూడా ఒక దశలో కలిగింది. కానీ ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సెమీ ఫైనల్స్ లోనే కాదు ఫైనల్స్ కే దూసుకు వచ్చింది. తమ దైన ఆటతో అందరినీ ఆకట్టుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు చివరకు ఇండియా నుంచి కప్పును ఎగరేసునుకుని వెళ్లిపోయారు. కేవలం ఇద్దరి ఆటగాళ్లు నిలదొక్కుకుని కునీ మరీ తమ విజయాయినికకారణమయ్యారు. దటీస్ ఆస్ట్రేలియా.


Tags:    

Similar News