వావ్... వార్నర్ వరల్డ్ కప్‌లో 150 పరుగులు

వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లలో కొంత ఓటములు చవి చూసిన ఆస్ట్రేలియా పుంజుకుంటున్నట్లే కనపడుతుంది

Update: 2023-10-20 11:38 GMT

వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లలో కొంత ఓటములు చవి చూసిన ఆస్ట్రేలియా పుంజుకుంటున్నట్లే కనపడుతుంది. ఈరోజు పాక్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆడుతున్నారు. ఓపెనర్లు ఇద్దరూ సెంచరీ చేశారు. వార్నర్ 150 పరుగులు చేశాడు. నలభై ఓవర్లకు ఆస్ట్రేలియా 303 పరుగులు చేసింది. ఇంకా పది ఓవర్లు మిగిలి ఉన్నాయి. దీంతో నాలుగు వందల వరకూ స్కోరు చేేరే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు.

పాక్ కు కష్టమే..
టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అదే తప్పు చేేసినట్లుంది. ఓపెనర్లు వార్నర్, మార్ష్ లు వదలకుండా క్రీజును అంటిపెట్టుకునే ఉన్నారు. ఇంతటి భారీ లక్ష్యాన్ని సాధించాలంటే పాక్ బ్యాటర్లు శ్రమించాల్సి ఉంటుంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ను అందరూ ఆసక్తితో చూస్తున్నారు. పాక్ కు మరో ఓటమి తప్పేట్లు లేదన్న విశ్లేషణలువినిపిస్తున్నాయి. ప్రస్తుతం వార్నర్, స్టోన్స్ క్రీజులో ఉన్నారు. ఇంకా చేతిలో ఏడు వికెట్లు ఉండటంతో భారీ స్కోరు చేసే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News