హోదా ఉద్యమానికి నో చెప్పిన ఏపీ కెబినెట్

Update: 2017-01-25 10:44 GMT

వెలగపూడి సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. విశాఖపట్నం లో ప్రత్యేక హోదా ఆందోళనలకు ఇది సమయం కాదన్న బాబు., ఆందోళనలకు అనుమతి లేదని ప్రకటించారు. పార్టనర్ షిప్ సమ్మిట్ కు 42 దేశాల ప్రతినిధులు హాజరు అవుతున్నారు.ఈ సమయంలో ఇది మంచిది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. వైసీపీ., జనసేన లది అభివృద్ధిని వ్యతిరేకించే చర్యగా అభివర్ణించారు. సాగరతీరంలో ఎటువంటి ఆందోళనలకూ అనుమతివ్వకూడదని కేబినెట్ నిర్ణయించింది.

వెలగపూడిలో అసెంబ్లీ భవనం ప్రారంభానికి ప్రధాని మోడీని పిలవాలని కేబినెట్ నిర్ణయించింది.. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు 638ఎకరాలు కేటాయింపును ఆమోదించారు. అనంతపురం జిల్లాలో 500మెగావాట్ల సొలార్ విద్యుత్ ప్రాజెక్ట్ కు 4800ఎకరాల భూమి కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగకుండా విశేష ఉప గుత్తేదారు అయిన ఎల్ అండ్ టీ సంస్థకు రూ.95 కోట్లు ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించడానికి మంత్రిమండలి ఓకే చెప్పింది. గౌతమి పుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను మినహాయింపుకు మంత్రిమండలి ఆమోదించింది.

Similar News