సిగిరెట్ మాటున రెండేళ్లుగా అత్యాచారం

Update: 2017-04-08 03:12 GMT

ఆ అమ్మాయికి సరదాగా సిగిరెట్ అలవాటు చేశాడు. స్నేహితుడే కదా అని నమ్మి ఆ యువతి సిగిరెట్లు తాగేందుకు అతని రూమ్ కు వెళ్లేది. ఆ సిగిరెట్ ఇవ్వకపోతే యువకుడిపై చిరాకు పడేది. అలాగా సిగిరెట్ కు ఎడిక్ట్ అయింది ఆ యువతి. ఇంతకీ సిగిరెట్ తో ఆ యువకుడు ఏం చేసేవాడో తెలుసా? ఆమెకు తెలియకుండా సిగిరెట్ లో గంజాయి కూరేవాడు. గంజాయి సిగిరెట్ తాగిన ఆ యువతి మత్తులోకి జారుకునేది. దీంతో ఆ యువకుడా యువతిపై అత్యాచారం చేసేవాడు. రెండేళ్ల నుంచి సాగుతున్న ఈ ఘోరాన్ని ఆ యువతి గుర్తించ లేకపోయింది. చివరకు ఒకరోజు మత్తులో ఉన్న యువతిని చూసి ఆ తల్లికి అనుమానం వచ్చి నిలదేస్తే....తన స్నేహితుడి పేరు చెప్పింది. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. మియాపూర్ కు చెందిన యువతికి, మలక్ పేట్ కు చెందిన జీషాన్ స్నేహితుడు. జీషాన్ యువతికి గంజాయి సిగిరెట్లు అలవాటు చేయడంతో తరచూ జీషాన్ గదికి వెళ్లేది. మత్తులో ఉన్న యువతిపై జీషాన్ అత్యాచారం చేసేవాడు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో బయటపెట్టాడు జీషాన్. దీంతో అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఆ యువతి మాత్రం ఇప్పటికీ అదే సిగిరెట్లు కావాలని యాగీ యాగీ చేస్తుండటంతో ఆమెకు కుటుంబసభ్యులు ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు.

Similar News