వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే సైకిల్

Update: 2016-12-28 11:59 GMT

వచ్చే ఎన్నికల్లో సైకిల్ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. ఎవరితోనూ పొత్తులుండవు. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్లాలని సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ చీఫ్ ములాయం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి అఖిలేష్ మాత్రం కాంగ్రెస్, ఆర్జేడీని కలుపుకెళ్లాలని ఇటీవల ప్రయత్నించారు. పొత్తులతో వెళ్లనున్నట్లు అఖిలేష్ సూత్రప్రాయంగా తెలిపారు కూడా. రాహుల్ ను కూడా కొన్ని సందర్భాల్లో పొగిడేశారు అఖిలేష్. బీఎస్సీ, బీజేపీకి వ్యతిరేకంగా కూటమి అవతరిస్తుందన్న వార్తలూ వచ్చాయి. అయితే కొడుకు వ్యూహాలను నేతాజీ అంగీకరించడం లేదు. తన సొంత వ్యూహంతోనే ములాయం ఎన్నికల పోరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అలాగే అఖిలేష్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు ములాయం. పొత్తులుండవని ప్రకటించిన పెద్దాయన వెంటనే సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధుల జాబితాను కూడా విడుదల చేశారు. ఇప్పటికే 375 మంది పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసినట్లు ములాయం చెప్పారు. మిగిలిన సీట్లకు కూడా త్వరలోనే అభ్యర్ధులను ప్రకటిస్తామన్నారాయన. అయితే ప్రకటించిన స్థానాల్లో ఎక్కువమంది శివపాల్ యాదవ్ అనుచరులేనని చెబుతున్నారు. అఖిలేష్ సన్నిహితులకు ములాయం మొండిచేయి చూపారట. మొత్తం మీద తండ్రి కొడుకుల మధ్య వార్ ఇక ప్రారంభం కానుందేమో.

Similar News