రైల్లో మూడున్నర కోట్ల బంగారం

Update: 2017-09-02 04:30 GMT

విజయవాడ కేంద్రంగా అక్రమ బంగారం రాకెట్‌ నడుస్తోందని అనుమానిస్తోన్న పోలీసుల వరుస తనిఖీల్లో భారీ బంగారం దొరుకుతోంది. మొన్న కిలో బంగారం దొరికితే తాజాగా మూడున్నర కోట్ల విలువ చేసే ఆభరణాలు బయటపడ్డాయి. హౌరా నుంచి భారీగా బంగారాన్ని రైల్లో తరలిస్తున్నారనే సమాచారంతో తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్‌ను జల్లెడ పట్టారు. నెల్లూరుకు చెందిన భరత్‌ జైన్‌ బంగారం వ్యాపారాన్ని నిర్వహిస్తుంటాడు. ఇతని వద్ద పనిచేసే నర్సిరామ్‌ 13 కిలోల బంగారంతో హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాడు. రైలు విజయవాడ చేరగానే తనిఖీలు చేపట్టిన జిఆర్పీ సిబ్బంది నర్సీరామ్‌ లగేజీ తనఖీ చేశారు. అందులో ప్యాక్‌ చేసిన మూడున్నర కోట్ల విలువైన బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. వీటికి బిల్లులు లేకపోవడంతో కస్టమ్స్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. భరత్‌జైన్‌., నర్సిరామ్‌లను సెంట్రల్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించారు.

Similar News