తొలి బ్యాటింగ్ ఇంగ్లాండ్ దే : అదృష్టం వరిస్తుందా?

Update: 2016-11-09 04:13 GMT

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్ తో తొలిటెస్టులో తొలి బ్యాటింగ్ చేయడానికే నిర్ణయించుకుంది. రాజ్ కోట్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. కొహ్లి సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్ తో తలపడుతోంది. కివీస్ మీద టెస్ట్ సిరీస్ విజయంతో ఊపు మీదున్న భారత జట్టు ఇంగ్లాండ్ మీద కూడా ఘన విజయాలు నమోదు చేసుకోవాలనే ఉత్సాహంతోనే బరిలో ఉండడం సహజం.

దానికి తగ్గట్లుగానే.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మ్యాచ్ విజయావకాశాల గురించి తన అభిప్రాయం వెల్లడిస్తూ.. ఇంగ్లాండుకు భారత్ ను ఓడించేంత సత్తా లేదంటూ వ్యాఖ్యానించడం విశేషం.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను కుక్, హమీద్ లు ప్రారంభించారు. 19 ఏళ్ల కుర్రాడు హమీద్ ఇంగ్లాండ్ ఓపెనర్ గా ఆడుతుండడం విశేషం. హమీద్ కు కెరీర్లో ఇదే మొదటి టెస్టు కావడం విశేషం. తొలి రెండు ఓవర్లలోనే భారత ఫీల్డర్లు రెండు అమూల్యమైన క్యాచ్ లను జారవిడిచారు. మరి మన ఆటగాళ్లు టెస్టు సిరీస్ లో ఈ మ్యాచ్ లో ఎలాంటి బోణీ కొడతారో చూడాలి.

భారత్ మిశ్రాతో కలిపి అయిదుగురు బౌలర్లతో మ్యాచ్ కు సన్నద్ధం కాగా, ఇంగ్లాండ్ కూడా భారత్ ను ఎదుర్కోవడానికి ముగ్గురు స్పిన్నర్లతో తమ తుది జట్టును కూర్చుకోవడం విశేషం. ఇక ఈ సమరంలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.

Similar News