ట్రంప్ పై వ్యతిరేకతకు ఇది నిదర్శనం

Update: 2017-02-15 06:03 GMT

ప్రపంచాన్ని శాసించ కలిగిన అన్ని ఆర్ధిక వనరులు పుష్కలంగా వున్న అమెరికా దేశం ఇప్పుడు ప్రపంచ దేశాలలో అత్యధిక దేశాలకు శత్రువుగా మారింది. ఇందుకు ప్రధాన కారణం ఆ దేశంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావటమే. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న రోజులలో అందరికి హిల్లరీ క్లింటన్ కె అధ్యక్షా పదవి దక్కుతుందని గట్టిగా నమ్మటానికి కారణం ప్రచార కార్యక్రమాలలో ట్రంప్ తలపెట్టిన ఎకిలి చేష్టలే. అయితే అందరి నమ్మకాన్ని వమ్ము చేస్తూ అమెరికా సిటిజన్స్ తమ నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ని ఎన్నుకున్నారు. ఇది ఆ దేశ అంతర్గత వ్యవహారం అని సరిపెట్టుకోవటానికి కూడా లేకుండా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే జాతి వివక్ష తార స్థాయికి చేరిపోయింది. ట్రంప్ ఆఫీస్ లోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఇతర దేశస్థులకు అమెరికా ప్రతి క్షణం గండంగా మారింది. ఇమ్మిగ్రేషన్ లో విదేశీయులని వెనక్కి పంపిస్తున్న వైనాన్ని అమెరికన్ దేశస్థులలో కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ చర్యలకు అమెరికా లో ఇతర దేశస్థులంతా ఒక ఉద్యమాన్ని తలపెట్ట దాలిస్తే ఆ దేశస్థులైన వారు కూడా సహకరించారు. ట్రంప్ అధ్యక్ష నియామకం రద్దు కావాలని నిరసనలు వ్యక్తం చేశారు. కానీ రాజ్యాంగ విరుద్ధంగా అధ్యక్ష నియామకాన్ని రద్దు చేసే వెసులుబాటు ఎవరికీ ఉండదు. ఏమి చేయలేక అమెరికా లో ఇతర దేశస్థులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే ట్రంప్ పై నెలకొన్న వ్యతిరేక భావం ఎంతటి స్థాయికి చేరిందో తెలపటానికి మరొక ఉదాహరణ ఇది. అమెరికా దేశంలో తమ రూమ్ మేట్స్ ని ఆన్లైన్ యాడ్స్ పోస్ట్ చేసి సెలెక్ట్ చేసుకుంటుంటారు అక్కడి యువకులు. అయితే తమ రూమ్ మేట్స్ గా ఉండటానికి కొందరు విధించే షరతులతో పూర్తి శాఖాహారి ఐయి వుండాలని, నాన్ ఆల్కోహాలిక్ ఐయి వుండాలని, విద్యార్థి ఐయి ఉండాలనే షరతుల చిట్టా కనిపిస్తుంటుంది. కానీ జార్జ్ టౌన్ యూనివర్సిటీ లో చదువుకుంటున్న ఒక అమ్మాయి తనతో రూమ్ షేర్ చేసుకోవటానికి ట్రంప్ మద్దతుదారులకు అర్హత లేదని, ట్రంప్ వ్యతిరేకులు మాత్రమే సంప్రదించగలరంటూ ఆడ్ పోస్ట్ చేసింది. ఈ ఆడ్ అమెరికాలో నివసిస్తున్న విదేశీయులందరిని బాగా ఆకట్టుకుంది.

Similar News