జియో ట్యాగింగ్ ద్వారా నిఘా

Update: 2017-11-24 03:39 GMT

హైదరాబాద్ ను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో సెక్యూరిటీని మరింత పెంచారు. హైదరాబాద్ లో అన్ని చోట్ల కొద్దిసేపటి క్రితం తనిఖీలు ప్రారంభించారు. టెర్రర్ అలెర్ట్స్ ఉండటంతో అన్ని చోట్ల తనిఖీలను చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు దాదాపు రెండు వేల మంది హాజరుకానున్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. రూట్ మ్యాప్ రెడీ అయిందని, డిన్నర్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఫలక్ నుమా ప్యాలెస్ లో జరగనున్న డిన్నర్ లో మోడీ, ఇవాంకాతోపాటు పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. 58 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 3500 ఇళ్లల్లో ఉంటున్న వారి వివరాలను సేకరించామని తెలిపారు. డాగ్ స్వ్కాడ్, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. జియో ట్యాగింగ్ ద్వారా నిఘాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Similar News