జల్లికట్టుపై పట్టువీడని యువత

Update: 2017-01-19 04:05 GMT

జల్లికట్టుపై ఆందోళనలతో తమిళనాడు అట్టుడుకుతోంది. ముఖ్యంగా యువత ఆందోళనకు దిగడంతో పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రభుత్వం అలెర్ట్ అయింది. నేడు ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం భేటీ కానున్నారు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ ను జారీ చేయాలని ప్రధానిని పన్నీర్ బృందం కోరనుంది.

మరోవైపు మెరినాబీచ్ లో యువత ఆందోళన రెండు రోజుల నుంచి కొనసాగుతోంది. విద్యార్ధులకు రాజకీయ పార్టీలూ, సినీ పరిశ్రమ మద్దతు ప్రకటించింది. సినిమా షూటింగ్ లను తమిళనాడులో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జల్లికట్టు తమ సంప్రదాయంలో భాగమని దానిపై నిషేధం ఎత్తివేయాలని యువత చేస్తున్న ఆందోళన ఎటువైపుకు దారి తీస్తుందోనని ప్రభుత్వం కలవర పడుతోంది.నిషేధం ఎత్తివేసే వరకు ఆందోళన చేస్తామని విద్యార్ధులు చెబుతున్నారు. ఆందోళన చేస్తున్న యువతకు ఆహారం, మంచినీరు అందించేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. సినీ నటుడు లారెన్స్ ఈ ఆందోళనకు మద్దతు తెలిపి కోటి రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించారు.

Similar News