జపాన్ లో భూకంపం : పొంచి ఉన్న సునామీ భయం

Update: 2016-11-22 00:49 GMT

తూర్పు జపాన్ లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా సమాచారం రాలేదు. జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు రిక్టర్ స్కేలు మీద 6.9 గా నమోదు కాగలిగిన స్థాయిలో భారీ భూకంపం సంభవించింది. దీనికి అమెరికా భూ భౌతిక సర్వే కూడా ధ్రువీకరించింది.

భూకంపం సమయంలో సముద్రం అలలు 3 మీటర్లకు పైగా ఎత్తుతో ఎగసి పడడంతో సునామీ కూడా రావచ్చునని జపాన్ వాసులు భయపడుతున్నారు. ఈ మేరకు తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని గుర్తించినట్లు జపాన్ శాస్ర్తవేత్తలు ప్రకటించారు. జపాన్ లోని తీర ప్రాంత వాసులను సునామీ భయంతో ఖాళీ చేయిస్తున్నారు.

Similar News