కోర్టుల్లో పేలుళ్లే.. అల్‌ఖైదా అభిమాన దళం లక్ష్యం

Update: 2016-11-29 20:50 GMT

‘ది బేస్ మూమెంట్’ పేరుతో నడుస్తున్న ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అది. అల్‌ఖైదా మీద అభిమానంతో నడుస్తున్నట్లుగా తమ గురించి తాము ప్రకటించుకుంటుంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా తమ కార్యకలాపాలను విస్తరించుకుంటున్న ది బేస్ మూమెంట్ కు సంబందించిన ఉగ్రవాదులను పోలీసులు ఎన్ఐఏ సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. అల్‌ఖైదా ఉగ్రవాదులకు శిక్షలు పడినప్పుడు.. కోర్టుల వద్ద పేలుళ్లకు పాల్పడడం ద్వారా నిరసనలు వెలిబుచ్చడమే ఈ ఉగ్రవాద సంస్థ అనుసరిస్తున్న మార్గంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్, తెలంగాణ లోని కోర్టుల వద్ద పేలుళ్లకు పాల్పడడానికి వీరు తాజాగా స్కెచ్ వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ది బేస్ ముమెంట్ పేరుతో తమిళనాడుకు చెందిన యువకులు ఓ దళాన్ని నడుపుతున్నారు. ఒక ఫేస్ బుక్ పేజీని కూడా నిర్వహిస్తున్నారు. తమ నిరసనలను, కోర్టుల వద్ద పేలుళ్ల రూపంలో తెలియజేయడం వీరి వ్యూహం. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు కోర్టుల వద్ద పేలుళ్లకు పాల్పడ్డారు. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ కు నిరసనగా చిత్తూరు కోర్టు వద్ద బాంబులు పేల్చారు. అలాగే ఇస్రాంత్ జహాన్ ఎన్‌కౌంటర్ కు నిరసనగా.. కేరళ హైకోర్టు వద్ద కూడా పేలుళ్లుక పాల్పడ్డారు. యాకూబ్ ఉరికి వ్యతిరేకంగా మైసూరులోనూ కోర్టు వద్ద పేలుళ్లకు పాల్పడ్డారు. వీరు తాజాగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల వద్ద పేలుళ్లకు చేస్తున్న కుట్రలను పోలీసులు భగ్నమొనర్చారు.

ఒకవైపు ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. ఇస్లామిక్ ఉ్రగవాదం, దానికి అనుబంధంగా, సానుభూతి ప్రకటించే విధంగా అనేక కొత్త బృందాలు, యువకుల దళాలు పుట్టుకు వస్తూ ఉండడం విశేషం.

Similar News