కొడుకు కుడిచేతినే నరికేశాడు...ఎందుకంటే?

Update: 2018-03-07 02:14 GMT

మొబైల్‌ ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు చూస్తున్న కుమారుడి చేయి నరికేశాడో తండ్రి. హైదరాబాద్‌ పాతబస్తీలోని పహాడీషరీఫ్‌ జల్‌పల్లి ప్రాంతంలో ఉండే ఖయ్యుం ఖురేషి మాంసం వ్యాపారి. పెద్దకుమారుడు మహ్మద్‌ ఖాలెద్‌ ఖురేషీ (18)ని స్థానిక కేబుల్‌ టీవీ కార్యాలయంలో పనికి కుదిర్చాడు. పనికి వెళ్లకపోగా.. అస్తమానం ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తుండటాన్ని గుర్తించిన తండ్రి ఇటీవల కొడుకును మందలించాడు. ఫోన్‌ లాక్కోడానికి యత్నించగా.. తండ్రి చేయి కొరికి ఖాలెద్‌ పారిపోయాడు. ఆరోజు నుంచి ఇంట్లో గొడవ జరుగుతూనే ఉంది. ఖాలెద్‌ మళ్లీ అదే పని చేస్తుండడంతో ఖయ్యూం ఆగ్రహంతో ఊగిపోయాడు. మాంసం నరికే కత్తితో కుమారుడి కుడిచేతిని నరికేశాడు. ఖాలెద్‌ కేకలతో పరుగెత్తుకొచ్చిన తల్లి లబోదిబోమంటూ స్థానికుల సాయంతో ఆసుపత్రిలో చేర్పించింది. ఖయ్యుం పోలీసుల వద్ద లొంగిపోయాడు.

Similar News