కేసీఆర్ ఇంట్లో 150 గదులా?

Update: 2016-12-27 10:50 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో 150 గదులున్నాయా? అవుననే అంటున్నారు కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డబుల్ బెడ్ రూం ఇళ్లపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్లు రాష్ట్రంలో ఎన్ని కట్టిస్తారో చెప్పాలన్నారు. నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోతున్న సమయంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటి కార్యక్రమాలను పక్కన బెట్టి సీఎం క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించడంలో ఆంతర్యమేమిటని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎర్రవెల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించడంతో రాష్ట్రంలోని మిగిలిన ప్రజలూ ఎదురు చూస్తున్నారన్నారు. అయితే ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సీఎం క్యాంపు కార్యాలయం కేసీఆర్ ఆస్తి కాదని, తెలంగాణ ప్రజల ఆస్తి అని చెప్పారు. కాంగ్రెస్ ఇకనైనా తన మైండ్ సెట్ మార్చుకోవాలని కేసీఆర్ ఆగ్రహం చెందారు. నోట్ల రద్దుతో రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు సీఎం.

Similar News