కాపు రేపిన చిచ్చు

Update: 2017-12-02 07:35 GMT

కాపు రిజర్వేషన్లు తూర్పుగోదావరిజిల్లాలోచిచ్చుపెట్టింది. బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాకినాడలో కలెక్టరేట్ ను బీసీ సంఘాలు ముట్టడించాయి. రోడ్లపై టైర్లను ధ్వంసం చేశాయి. ఈ ఆందోళనలో పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు. ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు కాపులను బీసీల్లో చేర్చినా బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రభుత్వం చెబుతున్నా బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాకినాడలో జరిగిన ఆందోళన దాదాపు రెండు గంటల పాటు సాగింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Similar News