ఐటి అభివృద్ధికి వైఎస్సే కారణం !

Update: 2016-03-30 14:51 GMT

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పదవీ కాలం ముగిసే సమ యానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎక్స్‌పోర్టు రూ. 5,025 కోట్లు టర్నోవర్ అయిం దని, అదే ఐటీ ఎక్స్‌పోర్టు టర్నోవర్ వైఎస్ సీఎంగా పూర్తి అయ్యేనాటికి రూ. 33,482 కోట్లని ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంత దారుణంగా వ్యత్యాసం ఉంటే చంద్రబాబేమో ఐటీ, సెల్‌ఫోన్లు నేనే తీసుకువచ్చానని రకరకాలు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కంప్యూటర్లు కూడు పెడతాయా అని అపహాసం, ఎగతాళి చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీగానీ, సైబరాబాద్‌గానీ, ఇన్ఫార్మేషన్ టెక్నాలజీలో ఏపీకి నాంది పలికింది, శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడేనని ఎవరిని అడిగినా చెబుతారని, జగన్ కుటుంబంలో అడిగినా చెబుతారని ఆయన అన్నారు. వైఎస్ కుటుంబానికి తెలిసిందల్లా ఫ్యాక్షనిజం, కొడవలు, గొడ్డళ్లు, బాంబులు గురించి తెలుసునని, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, మొబైల్స్ గురించి తెలియదని మంత్రి ఎద్దేవా చేశారు. కాగా సెల్‌ఫోన్లు తానే కనిపెట్టానని, ఐటీని తానే తెచ్చానని చంద్రబాబు గొప్పలు చెప్పుకొంటారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఆయన మంగళవారం మధ్యాహ్నం ఈ అంశంపై మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హయాంలో 85 వేల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వారి సంఖ్య 2 లక్షలకు చేరుకుందని అన్నారు. చంద్రబాబు హయాంలో ఐటీ పెట్టుబడులు రూ. 3,533 కోట్లు అయితే, వైఎస్ హయాంలో అవిరూ. 13,250 కోట్లకు చేరుకున్నాయని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Similar News