ఏకంగా రద్దు చేయాల్సిందే అంటున్న రఘువీరా!

Update: 2016-11-14 12:29 GMT

ఆయన పార్టీ అధినేతలు కూడా అంత స్ట్రాంగ్ డిమాండ్ చేయలేదు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆమోదిస్తూనే, నల్లధనం కట్టడికి సహకరిస్తాం అంటూనే... జనం కష్టాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ.. స్వామిని మించిన స్వామి భక్తి ప్రదర్శించడం అలవాటు అయిందేమో.. ఏపీసీసీ చీఫ్ రఘువీరా మాత్రం.. ఏకంగా కొత్త 2వేల రూపాయల నోట్లను రద్దు చేయాలంటున్నారు. అలాగే వంద నోట్లను పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

పెద్ద నోట్లు రద్దు అంటున్న మోదీ ప్రభుత్వం ....కొత్తగా ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయాలని, అదే విధంగా సామన్యులకు రూ. 100 నోట్లులను అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపు మేరకు ఏపిసిసి అధ్వర్యంలో 13 జిల్లాలోని బ్యాంకుల వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారన్నారు. వారికి కావాలసిన సహయసహకారం అందించడంతో పాటు వారి పెద్ద నోట్లు రద్దుతో సామాన్యులు పడ్డుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లతాం అన్నారు.. .మోదీ. నల్లదనంపై యుద్దం అన్నారు... కాని నల్లకుబేరులు కాదు గాని సామాన్యులు, చిరువ్యాపారులు, విద్యార్థుల కష్టాలు బిజేపికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు.

హోదాతోనే రాష్ట్రాబివృద్ధి- 15న రాజమండ్రీలో ప్రజాబ్యాలెట్...

హోదా రాకుంటే భవిష్యత్ లో యువత దాదాపు కోటి ఉద్యోగాలను వదులకొవాల్సి ఉంటుందని.. రఘువీరారెడ్డి అన్నారు... ఏపికి హోదా ఇచ్చింది కాంగ్రెస్ అని ..మొదట హోదా కోసం పొరాటం చేసింది కాంగ్రెస్... గల్లీ నుంచి ఢిల్లీ వరకు హోదా కోసం పొరాడేది కాంగ్రెస్ అన్నారు... ఈ నెల 15 ఏపికి హోదా కావాలా, వద్దా అని యువత, విద్యార్థుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం ఏపిసిసి అధ్వర్యంలో యూత్ కాంగ్రెస్, ఎన్.ఎస్,యూ.ఐ నాయకులు చేస్తారన్నారు..ఈ ప్రయత్నం లో భాగంగా రాజమండ్రీలో నిర్వహించే ప్రజాబ్యాలెట్ విజయవంతం చేయాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.

Similar News