ఇలాంటి శిక్షలు వస్తేనే నేరగాళ్లలో భయం పుట్టేది

Update: 2016-09-28 10:00 GMT

ఒకే తరహా నేరాలు మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఒకరకమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. చట్టాల్లో పదును లేదండీ, శిక్షల్లో మార్పు రావాలండీ అంటూ ఉంటారు. నేరగాళ్లలో మార్పు వచ్చేలాంటి చట్టాలు కాదు, అసలు నేరం ఆలోచన వస్తేనే భయం పుట్టించే చట్టాలు రావాలని అందరూ ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ నేరం విషయంలో కర్నూలు కోర్టు అలాంటి శిక్షే విదించింది.

ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ దుర్మార్గుడికి కోర్టు బతికి ఉన్నంతకాలం జైలు శిక్షను విధించింది. ఇలాంటి శిక్షలు నేరగాళ్లలో మార్పు తీసుకువస్తాయంటూ జిల్లా ఎస్పీ కూడా వ్యాఖ్యానించారు.

ఇటీవలి కాలంలో అమ్మాయిల మీద అక్రుత్యాలు పెరిగిపోతున్న వైనం అందరూ గమనిస్తున్నదే. నిర్భయ, అభయ రూపంలో ఎన్ని కొత్త చట్టాలు రూపొందుతున్న నేరాలూ అలాగే పెరుగుతున్నాయి. పసిపిల్లల మీద కామాంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటన కర్నూలులో వెలుగుచూసిన నేపథ్యంలో.. కేసు నడిచింది.

Similar News