ఆయన ఎకానమీ క్లాస్ లో ప్రయాణం చేయటం ఆశ్చర్యపరిచిందట

Update: 2017-01-22 07:21 GMT

తమిళ దర్శకుడు హరి దర్శకత్వంలో సూర్య నటించిన విజయవంతమైన సింగం సిరీస్ లో మూడవ భాగం ఈ నెల 26 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుండటంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్ధేశించిన ప్రణాళిక ప్రకారం ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూనే నటుడు సూర్య తమిళనాడు లో జరుగుతున్న జల్లికట్టు నిషేధం పై నిరసన తెలిపే కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. సి 3 గా మార్చబడ్డ ఎస్ 3 సినిమా మళయాళ వెర్షన్ ప్రచార కార్యక్రమాలలో భాగం గా కేరళ వెళ్లిన సూర్య, కొచ్చి నుంచి తిరువనంతపురం వెళ్లే విమానంలో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి నిరాడంబరత చూసి ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి హోదా ని అనుభవిస్తున్న పినరాయి విజయన్.

సూర్య ప్రయాణిస్తున్న విమానంలో కోనోము క్లాస్ లో ప్రయాణించిన కేరళ ముఖ్య మంత్రి విజయన్ విమానం ల్యాండ్ ఐన తరువాత కూడా తన హోదా ప్రదర్శిస్తూ ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తూ వ్యవహరించకుండా తన ముందు నిలబడిన ప్రయాణికులందరూ వరుస క్రమంలో దిగేంతవరకు ఓపికగా క్యూ లైన్ లో నిలబడి వేచి చూసి విజయన్ విమానం దిగిన తీరు కూడా సూర్య ని అమితంగా ఆకట్టుకున్నాయట. కేరళ ముఖ్య మంత్రి సింప్లిసిటీ కి ఆకర్షితుడైన సూర్య తన చిత్ర ప్రచారానికంటే ఎక్కువగా కేరళ ముఖ్య మంత్రి సింప్లిసిటీ కి పబ్లిసిటీ చేయటంలో బిజీ అయిపోయాడు.

Similar News