అవును...వాళ్ళిద్దరూ సస్పెండ్ అయ్యారు...!

Update: 2018-01-23 13:56 GMT

ఎసిబి ఎఎస్పీ సునీతారెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోలీసు శాఖ పరువును బజారున పడేశారన్న ఉద్దేశంతో ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డిలను ఇద్దరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసిదంి. ఈ వ్య‌వ‌హారంపైన ఇప్ప‌డు పోలీసుల విచార‌ణ జ‌రుగుతుంది. మ‌హిళ ఉన్న‌తాధికారిణి. ఇన్ స్సెక్ట‌ర్ మ‌ల్లికార్జున్ రెడ్డి మ‌ధ్య గ‌త కొంత కాలం నుంచి వ్య‌వ‌హారం న‌డుస్తున్న‌ట్లుగా పోలీసుల విచార‌ణ లో బ‌య‌ట ప‌డింది. రెండు సంవ‌త్స‌రాల క్రితమే సునీతారెడ్డికి, మ‌ల్లికార్జున్ రెడ్డి ల మ‌ధ్య వ్య‌వ‌హారం భ‌ర్త‌కు తెలుసు. రాజీ చేసే ప్ర‌య‌త్నం కూడా జ‌రిగింది. ఈ కేసులో పోలీసుల అన్ని ఆధారాల‌ను సేక‌రిస్తున్నారు. ఇప్పటికి న‌లుగురు స్టేట్ మెంట్స్ ను కూడా పోలీసులు రికార్డు చేశారు.

భర్తే స్వయంగా ఫిర్యాదు చేయడంతో....

ఎసిబిలో అద‌న‌పు ఎస్ పీగా ప‌నిచేస్తున్న అధికారిణి తో ఇన్ స్పెక్ట‌ర్ కు మ‌ధ్య రాస‌లీల‌ల‌ను భ‌ర్తే స్వ‌యంగా ప‌ట్టించాడు. ఎఎస్పి భ‌ర్త ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసుల విచార‌ణ చేస్తున్నారు. కూక‌ట్ ప‌ల్లిలో ని ఎఎస్ పీ ఇంటిలో పోలీసుల సొదాలు చేశారు. అలాగే ఎఎస్ పి - మ‌ల్లికార్జున్ రెడ్డి ల‌మ‌ధ్య వున్న సంబంధం పైన పోలీసులు విచారించి ఆధారాలు సేక‌రిస్తున్నారు. ఇక పొతే అధికారిణి భ‌ర్త ఇచ్చిన ఫిర్యాదు లో ప‌లు విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి త‌న భార్య‌కు ఇన్ స్సెక్ట‌ర్ కు మధ్య సంబంధం ఉందని, గ‌తంలో ఒక్క‌సారి రెడ్ హ్యాండండ్ గా తాను ప‌ట్టుకున్నాన‌ని..అయితే అప్ప‌డు ఇలాంటి త‌ప్పు మ‌ళ్లీ ఎప్ప‌డు చేయ‌న‌ని చెప్పార‌ని త‌న ఫిర్యాదులో సురెంద్ర‌ర్ రెడ్డి తెలిపారు. ఇక పొతే త‌న భార్య‌ను వివాహం చేసుకుంటానని చెప్పి నిత్యం మ‌ల్లికార్జున్ రెడ్డి వెధించేవాడని.. నిత్యం మెసెజీలు చేసి చిత్ర హింస‌లు పెట్టాడ‌ని తెలిపారు. అంతేగాకుండా ప్ర‌తినిత్యం కాల్ చేసి వేధించే వాడ‌ని..అయితే ప‌లు మార్లు కూడా తాను మంద‌లించానని. తెలిపారు. దీంతో పాటుగా గ‌త కొన్ని నెల‌లుగా తాను ఇంట్లో లేన‌ని, విదేశాల్లో ఉన్నానని, ఈ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ స్నేహం మొద‌లైందని తెలిపారు.

Similar News