అబ్బే చిన్న విషయమే...రచ్చొద్దన్న మంత్రి నారాయణ

Update: 2017-07-18 15:47 GMT

ఎడతెరిపి లేని వర్షాల వల్ల మంత్రుల ఛాంబర్లలోకి నీళ్లు కారడం చిన్న విషయమేనట. మంగళవారం ఉదయం నాలుగో బ్లాకులో నీళ‌్ళు కారిన మంత్రులు గంటా., దేవినేని ఛాంబర్లను పరిశీలించిన నారాయణ భవనాల్లో ఎలాంటి లోపాలు లేవన్నారు. భవనం పై భాగంలో ఉన్న డక్ట్‌ షీట్‌ బయటకు రావడం వల్లే వర్షపు నీరు బయటకు వచ్చిందన్నారు. వాటిని తొలగించాల్సిందిగా నిర్మాణ సంస్థల్ని ఆదేశించినట్లు చెప్పారు. భవనాలను నిర్మించిన తర్వాత రెండేళ్ల పాటు మరమ్మతుల్ని నిర్మాణ సంస్థలే చేపడతాయన్నారు. చిన్నచిన్న లోపాలున్న వాటిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదన్నారు. కట్టుకునే ఇళ్లలో కూడా లోపాలు సహజమేనని చెప్పుకొచ్చారు. గతంలో ఇదే తరహా సమస్య తలెత్తినపుడు సిఐడి ఎంక్వైరీ వేసిన ప్రభుత్వం తాజా ఘటనపై మాత్రం చిన్న విషయమేనని ప్రకటించడం గమనార్హం.

Similar News