అధికారంలోకి వచ్చిన వెంటనే కోదండరామ్ కు..??

Update: 2018-11-11 13:18 GMT

రానున్న తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి విజయం దాదాపుగా ఖాయమయిపోయిందని చెప్పారు. ప్రజాకూటమి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. పీసీీీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ జన సమితి కార్యాలయానికి చేరుకున్న ఉత్తమ్ అన్ని పార్టీల నేతలతో చర్చించారు. కూటమి విజయం సాధిస్తే ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమాన్ని సమర్థంగా నడిపిన వ్యక్తి కోదండరామ్ అని ఉత్తమ్ కొనియాడారు.

కోదండరామ్ కు అవమానాలు.....

కోదండరామ్ ఉద్యమంలోనూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కోదండరామ్ కు ఎలాంటి అవమానాలు జరిగాయో అందరికీ తెలుసునన్నారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ఆదుకోలేదన్నారు. కనీసం ధర్నా చౌక్ లో కూడా నిరసనలు తెలపనివ్వ కుండా నియంతలా వ్యవహరించారన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే కోదండరామ్ నేతృత్వంలో చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

Similar News