టీడీపీలో చీలిక ఖాయం

తెలుగుదేశం పార్టీలో చీలిక రాబోతుందని తమ వద్ద స్పష్టమైన నివేదికలున్నాయని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అది ఏ రూపంలో వస్తుందో త్వరలోనే తెలుస్తుందన్నారు. చీలిక [more]

Update: 2020-02-06 12:49 GMT

తెలుగుదేశం పార్టీలో చీలిక రాబోతుందని తమ వద్ద స్పష్టమైన నివేదికలున్నాయని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అది ఏ రూపంలో వస్తుందో త్వరలోనే తెలుస్తుందన్నారు. చీలిక వస్తుందనే చంద్రబాబు ఆందోళనలో ఉన్నారన్నారు. ఎమ్మెల్సీలు చంద్రబాబుపై కోపంతో ఉన్నారన్నారు. చివరకు ఎమ్మెల్సీలకు చంద్రబాబు జీతాలిచ్చుకునే పరిస్థిితి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత లోకేష్ పై కూడా వత్తిడి పెరుగుతుందన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారన్నారు. అలా ప్రచారం చేసుకుని స్పల్ప ఆనందాన్ని ఆయన పొందుతున్నారని చెప్పారు. జగన్ ఇటు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తన పార్టీని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. దమ్ముంటే చంద్రబాబు భద్రత లేకుండా తుళ్లూరు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదన్నారు.

Tags:    

Similar News