లోకేష్ వీడియోలే రిటర్న్ గిఫ్ట్ కావచ్చు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ [more]

Update: 2019-01-18 10:01 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ కూకట్ పల్లిలోని లోధియా అపార్ట్ మెంట్ లో లోకేష్ చేసిన అక్రమ వ్యవహారాల వీడియోలు కేసీఆర్ త్వరలో బయట పెడతారని తెలుస్తోందని, బహుశా చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే కావొచ్చని ఆయన అనుమానించారు. ఫెడరల్ ఫ్రంట్ పై జగన్ తో కేటీఆర్ చర్చిస్తే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని, స్వార్థం కోసం ఏ పార్టీతోనైనా జత కడతారన్నారు. వైఎస్ఆర్ ను ఎదుర్కోవడానికి 2009లో కేసీఆర్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు.

Tags:    

Similar News